వారి ప్రేమ ఏమైందంటూ జగన్ భావోద్వేగం

61చూసినవారు
వారి ప్రేమ ఏమైందంటూ జగన్ భావోద్వేగం
వైసీపీ అధినేత జగన్ ఎన్నికల ఫలితాల పై మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే. “రాజకీయ జీవితంలో ఎన్నడూ ఎవరూ చూడకూడని పరిస్థితులు కూడా ఎదుర్కొన్నాను. దీనిని కూడా ఎదుర్కొంటాను. అక్కా చెల్లెమ్మల ప్రేమ దక్కకపోవడం బాధాకరం. నేనేం తప్పు చేశానో, నన్ను ఎవరు మోసం చేశారో నాకు ఇప్పటికీ అర్దం కావడం లేదు.” అంటూ జగన్ భావోద్వేగానికి గురయ్యారు. అతని కళ్లలో నీళ్లు తిరిగాయి. అంతలోనే సర్దుకొని మళ్లీ చిరునవ్వు నవ్వి థాంక్యూ అంటూ ముగించారు.

సంబంధిత పోస్ట్