తెలంగాణలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, గౌరవ వేతన ప్రాతిపదికన పనిచేస్తున్న సిబ్బంది సర్వీసును మరో 4 నెలలు ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖలకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మెమో జారీ చేశారు. వీరి సర్వీసు ఈ ఏడాది మార్చి 31తోనే ముగియగా జులై 31 వరకు అనుమతిస్తున్నామని పేర్కొన్నారు. సిబ్బందికి సకాలంలో వేతనాలు చెల్లించాలని సూచించారు.