ప్రభాస్ 'కల్కి 2898ఏడీ' చిత్రానికి సంబంధించిన రోబోటిక్ ఎలక్ట్రిక్ కారును మేకర్స్ గ్రాండ్ ఈవెంట్లో తాజాగా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ బుజ్జి కారును జాయెమ్ ఆటోమోటివ్, మహీంద్రా కంపెనీలు సంయుక్తంగా తయారు చేశాయి. దీని కోసం దాదాపుగా రూ.7కోట్లు ఖర్చయ్యింది. యూనిక్‌గా పెద్ద పెద్ద టైర్లతో ఉన్న ఈ కారు బరువు ఆరు టన్నులు. పవర్ 94కేవీ, బ్యాటరీ 47 KWH, టార్క్ 9800NMగా ఉన్నాయి.