నాటో మిత్ర దేశాలు నెదర్లాండ్స్‌కు చెందిన డచ్ ప్రధాని మార్క్ రూటేనె తదుపరి సెక్రటరీ జనరల్‌గా ఎంపిక చేశాయి. జెన్స్ స్టాల్టెన్‌బర్గ్ వారసునిగా రూటేను నియమించాలని నార్త్ అట్లాంటిక్ కౌన్సిల్ నిర్ణయించిందని ఆ కూటమి బుధవారం నాడిక్కడ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. అక్టోబరు 1న రూటే ఈ కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు.