లోన్ తీసుకోకపోయినా.. కచ్చితంగా మీరు క్రెడిట్ స్కోర్ తనిఖీ చేస్తూ ఉండాలి. ఇటీవల అనేక మంది ఆర్థిక నేరగాళ్లు వ్యక్తులకు తెలియకుండా, వారి పేరుపైన మోసపూరితంగా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. దీని ఫలితంగా ఆయా వ్యక్తుల క్రెడిట్ స్కోర్లు బాగా దెబ్బతిన్నాయి. కనుక మీరు కూడా రుణం తీసుకోకపోయినా కనీసం ఏడాదికి ఒకటి లేదా రెండు సార్లు క్రెడిట్ స్కోర్‌ను చెక్ చేసుకోవడం ఉత్తమం.