'వడాపావ్' ఇండియన్ స్ట్రీట్ ఫుడ్స్‌లో చాలా ఫేమస్. మహారాష్ట్ర ప్రజలకు ఎక్కువగా ఇష్టమైన స్నాక్ ఇది. తాజాగా ఈ వడాపావ్ ప్రపంచ గుర్తింపును పొందింది. ప్రపంచంలోని టాప్-50 బెస్ట్ శాండ్విచ్ల జాబితాలో స్థానం సంపాదించుకుంది. ప్రముఖ ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ అయిన 'టేస్ట్ అట్లాస్' ప్రకారం ప్రపంచంలోని బెస్ట్ శాండ్‌విచ్‌లలో వడాపావ్ 19వ స్థానంలో నిలిచింది.