ఉమ్మడి పౌర‌స్మృతి బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

52చూసినవారు
ఉమ్మడి పౌర‌స్మృతి బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
వివాహం, విడాకులు, వార‌స‌త్వం వంటి విష‌యాల్లో అంద‌రికీ ఒకే త‌ర‌హా నిబంధ‌న‌ల కోసం ఉద్దేశించిన ఉమ్మడి పౌర‌స్మృతి బిల్లు (UCC)కి ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఇటీవలే ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఉత్తరాఖండ్‌ యూనిఫాం సివిల్‌ కోడ్‌ బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం సంతకం చేశారు. రాష్ట్రపతి ఆమోదంతో ఈ బిల్లు చట్టరూపం దాల్చింది. ఇప్పటికే యూసీసీ బిల్లును ఆమోదించిన ఏకైక రాష్ట్రంగా ఉత్తరాఖండ్‌ నిలిచింది.

సంబంధిత పోస్ట్