గోషామహల్ స్టేడియంలో నిర్మించబోయే ప్రతిపాదిత ఉస్మానియా ఆసుపత్రిపై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. డ్రైనేజీ, విద్యుత్, మంచినీరు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు వివిధ శాఖలతో సమన్వయం చేసుకునే బాధ్యతను సీనియర్ ఐఏఎస్ అధికారి దానకిషోర్ కు అప్పగించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.