కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రైల్వే మంత్రిత్వ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. లీవ్ ట్రావెల్ కన్సెషన్ (LTC)ను విసర్తిస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు 385ప్రీమియం ట్రైన్లలో ప్రయాణించేందుకు అనుమతినిస్తూ ఆదేశాలు జారీచేసింది. ఇందులో వందే భారత్, హమ్ సఫర్, తేజస్, రాజధాని, శతాబ్ది, దురంతో రైళ్లు ఉన్నాయి. LTCద్వారా ఉద్యోగులు ప్రతి రెండేళ్లకోసారి స్వస్థలాలు, దేశంలో ఎక్కడికైనా ప్రయాణించవచ్చు.