లగచర్ల రైతులకు మద్దతుగా అసెంబ్లీ ఆవరణలో కేటీఆర్ నిరసన

రైతులకు బేడీలు, మంత్రులకు జల్సాలు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ద్వజమెత్తారు. సోమవారం లగచర్ల రైతులకు మద్దతుగా అసెంబ్లీ ఆవరణలో ప్లకార్డులతో కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి నిరసన తెలిపారు. గిరిజన రైతుల చేతికి బేడీలా సిగ్గు, సిగ్గు అంటూ నినాదాలు చేశారు. మరోవైపు అసెంబ్లీలో లగచర్ల విషయంపై చర్చ ఎందుకు జరగడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్