ఐసీసీ తాజాగా అన్ని ఫార్మాట్ల ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. ఈక్రమంలో వన్డే ఆల్ రౌండర్ ర్యాంకింగ్‌లో అఫ్గానిస్థాన్ స్టార్ ప్లేయర్ మహ్మద్ నబీ 314 పాయింట్లతో అగ్రస్థానానికి దూసుకొచ్చారు. దాదాపు ఐదేళ్లుగా నం. వన్‌గా ఉన్న షకీబ్ అల్ హసన్ 2వ స్థానానికి పడిపోయారు. ఇక టెస్టు ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా, టీ20 ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్‌లో షకీబ్ టాప్ ప్లేస్‌లో ఉన్నారు.