కాఫీలో నెయ్యి(బుల్లెట్ కాఫీ) వేసుకుని తాగితే బరువు తగ్గుతారని నిపుణులు అంటున్నారు. ఇందులో కార్బ్స్ తక్కువగా ఉంటాయి. రెగ్యూలర్గా తీసుకోవడం వల్ల హెల్తీ ఫ్యాట్స్ శరీరంలోకి నెయ్యి ద్వారా వెళ్లి.. చెడు కొవ్వును బయటకు పంపిస్తాయని వెల్లడించారు. ఎసిడిటీ సమస్యతో ఉన్నవారికి ఈ బుల్లెట్ కాఫీ విరుగుడుగా పనిచేస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగ్గా చేస్తుంది. మలబద్ధకం సమస్యతో ఇబ్బందిపడేవారికి ఇది చాలా మంచి ఫలితాలు ఇస్తుంది.