మద్నూర్ కేంద్రం అభివృద్ధి కొరకు విద్య , వైద్యం , ప్రాంగణాలు ఏర్పాటు కోసం అనేక ఎకరాల భూమి కి భూ దాత గా పేరు గాంచిన వేణు గోపాల్ సెట్ ఇనాని మృతి పట్ల మద్నూర్ గ్రామస్తులు విషాదఛాయలో ఉన్నారు. గురువారం రోజున హైదరాబాద్ లోని స్వగృహం లో అనారోగ్యం తో మృతి చెందడం పట్ల గ్రామస్తులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. శుక్రవారం రోజున గ్రామస్తులు మార్కెట్ సముదాయం పూర్తిగా బంధు పాటిస్తూ వేణు గోపాల్ ఇనాని ఆత్మకు శాంతి కలగాలని బంధు పాటించడం జరిగింది. శుక్రవారం రోజున మద్నూర్ కేంద్రంలో గాంధీ చౌక్ లో అన్ని వర్గాల వారు సంయుక్తంగా కలిసి కట్టుగా ఏర్పడి వేణు గోపాల్ సెట్ ఇనాని చిత్ర పటానికి పూలమాలలు వేసి భక్తి శ్రద్ధ తో నివాళులర్పించారు. గ్రామ సర్పంచ్ దరస్వార్ సురేష్ , పశు వైద్యుడు విజయ్ బండివార్ , సామాజిక కార్యకర్త రమేష్ సెట్ తమ్మేవార్ , బి. ఆర్. యస్. పార్టీ మండల అధ్యక్షుడు సంగమేశ్వర్ ఆధ్వర్యంలో గ్రామస్తులు , యువకులు , విద్యార్థులు 2 (రెండు ) నిమిషాలు మౌనం పాటిస్తూ వారి ఆత్మకు భగవంతుడు స్వర్గం లో ఉన్నత స్థానం కల్పించాలని అన్ని వర్గాలు ముక్తకంఠంతో దేవుడి తో ప్రార్తించడం జరిగింది. అలాగే మేజర్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ సురేష్ , ఉప సర్పంచ్ విట్ఠల్ బోయిన్ వార్ ఆధ్వర్యంలో పాలక వర్గం సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటిస్తూ వారి చిత్ర పటానికి పూలమాలలు వేసి ప్రగాఢ సానుభూతి తెలిపారు.