చలికాలంలో పిల్లలకు ఎలర్జీలు ఎక్కువగా వస్తుంటాయి.అందుకే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే వాటి నుంచి సులభంగా తప్పించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. చలికాలంలో పసిపిల్లలకు సాధ్యమైనంత వరకు తల్లిపాలు మాత్రమే పట్టాలి. పిల్లలకు డెయిరీ పాలు పట్టకూడదు. పిల్లలను దుమ్ము, ధూళికి వీలైనంత దూరంగా ఉంచాలి. మట్టిలో ఆటలు ఆడకుండా చూసుకోవాలి. అలాగే పిల్లలను పౌడర్లు, పర్ ఫ్యూమ్, రూమ్ ఫ్రెష్ నర్స్ లాంటి వాటికి కూడా దూరంగా ఉంచాలి.