ములుగు జిల్లాలో మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌పై డీజీపీ జితేందర్ స్పందించారు. మావోయిస్టులపై విషపదార్థాలు ప్రయోగించారనేది దుష్ప్రచారం అని చెప్పారు. ఈ కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారని.. హైకోర్టు, ఎన్‌హెచ్‌ఆర్‌సీ సూచనల మేరకు శవపరీక్షలు చేస్తున్నారని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు జరుగుతోందన్నారు.