టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ పేలవ ప్రదర్శనతో గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో న్యూజిలాండ్ గ్రూప్ దశ దాటి ముందుకు వెళ్లలేకపోవటం ఇదే తొలిసారి. దీంతో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 2024-25 సీజన్ కోసం కొత్త సెంట్రల్ కాంట్రాక్ట్‌ను అంగీకరించనని చెప్పాడు. దీంతోపాటు వైట్ బాల్ జట్టు కెప్టెన్సీ నుంచి కూడా విలియమ్సన్ తప్పుకున్నాడు.