పుతిన్‌కు రెడ్‌కార్పెట్‌‌తో వెల్క‌మ్ ప‌లికిన కిమ్‌

79చూసినవారు
పుతిన్‌కు రెడ్‌కార్పెట్‌‌తో వెల్క‌మ్ ప‌లికిన కిమ్‌
ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌.. ఇవాళ ఉత్త‌ర కొరియా చేరుకున్నారు. రాజ‌ధాని ప్యోంగ్‌యాంగ్‌లో నార్త్ కొరియా దేశాధినేత‌ కిమ్ జాంగ్ ఉన్.. ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. దాదాపు 9 గంట‌ల పాటు పుతిన్ .. ఉత్త‌ర కొరియాలో ఉండ‌నున్నారు. ఆ ఇద్ద‌రి నేత‌ల మ‌ధ్య 90 నిమిషాల పాటు చ‌ర్చ‌లు జ‌ర‌గ‌నున్న‌ట్లు తెలుస్తోంది. పుతిన్ రాక సంద‌ర్భంగా సెంట్ర‌ల్ స్క్వేర్‌ను క‌ల‌ర్‌ఫుల్‌గా డెక‌రేట్ చేశారు. భారీ ఎత్తున ప‌రేడ్‌ను నిర్వ‌హించ‌నున్నారు.

సంబంధిత పోస్ట్