పాకిస్థాన్‌లో ఖలీల్ జిబ్రాన్ అనే జర్నలిస్టును గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఖైబర్ జిల్లాలోని మజ్రినా సుల్తాన్‌ఖేల్ ప్రాంతంలో ఉన్న ఖలీల్ ఇంటి వద్దే అతడిపై కాల్పులు జరిపారు. అనంతరం దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనలో సాజిద్ అనే మరో వ్యక్తి కూడా గాయపడినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.