పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయుడికి ఘన సన్మానం

బోధన్ మండలం కల్దుర్ కి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహించి పదవి విరమణ పొందిన సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయులు చెల్లా శ్రీనివాస్ రెడ్డి, మరియు బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయురాలు సుజాతకు మండల విద్యాశాఖ అధికారులు, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు శనివారం శాలువాలతో ఘనంగా సన్మానం చేశారు. పదవి విరమణ మరియు బదిలీలు ప్రభుత్వ ఉద్యోగస్తులకు సర్వసాధారణమని మండల విద్యాశాఖ అధికారి నాగనాథ్, నోడల్ అధికారి నాగయ్య అన్నారు.

సంబంధిత పోస్ట్