ఆరోగ్యాన్నే కాదు.. అందాన్ని పెంచే ఓట్స్

ఓట్స్ ఆరోగ్య పోషణతో పాటు సౌందర్యపోషణకూ దోహదం చేస్తాయి. రెండు టేబుల్ స్పూన్ల ఓట్స్ పౌడర్‌లో మూడు టేబుల్ స్పూన్ల పెరుగు, టీ స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి, మెడకు, చేతులకు పట్టించాలి. పదిహేను నిమిషాల తర్వాత చేతి వేళ్లతో వలయాకారంగా రుద్దుతూ చల్లటి నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేయటం వల్ల చర్మానికి తగిన పోషణ లభించడంతో పాటు మృతకణాలు తొలగిపోయి చర్మం కాంతివంతమవుతుంది.

సంబంధిత పోస్ట్