మంథని మండలం బెస్తపల్లి గ్రామంలో నిర్వహించిన తోకల పెద్ద పోచయ్య - రాజమ్మ స్మారక ఔట్ డోర్ షటిల్ టోర్నీ విజయవంతంగా సోమవారం ముగిసింది. గ్రామంలోని యువతను ప్రోత్సహించాలని గ్రామస్థాయిలో ఈ క్రీడను నిర్వహించారు.
టోర్నీలో నగదు గెలిచిన విజేతలు అదే గ్రామంలోని యువతకు క్రీడా సామగ్రి అవసరాలకు నగదును అందజేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు. అనంతరం వారిని పలువురు రాజకీయ నాయకులు, గ్రామస్థులు అభినందించారు.