తెలంగాణలోని రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో కాసేపట్లో వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, జనగాం, వనపర్తి, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఇవాళ రాత్రిలోగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది.