కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్.. తీర్పు రిజర్వ్

71చూసినవారు
కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్.. తీర్పు రిజర్వ్
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన సీఎం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌ను రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును శనివారం రిజర్వ్ చేసింది. జూన్ 5న తీర్పు రానుంది. లిక్కర్ పాలసీ కేసులో సుప్రీంకోర్టు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్‌ ముగియడంతో కేజ్రీవాల్ ఆదివారం లొంగిపోనున్నారు. అయితే వైద్యపరమైన కారణాలతో తన మధ్యంతర బెయిల్‌ను ఏడు రోజుల పాటు పొడిగించాలని కేజ్రీవాల్ గతంలో సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించారు.

సంబంధిత పోస్ట్