‘యానిమల్’లో గీతాంజలిగా తన నటనతో ఆకట్టుకున్నారు నటి రష్మిక. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. ‘నటీనటులు వారి పాత్రలకు వంద శాతం న్యాయం చేయడానికి ప్రయత్నిస్తారు. సినిమాను ఆదరించాలా, లేదా అనేది ప్రేక్షకుల స్వేచ్ఛపై ఆధారపడి ఉంటుంది. ఇందులో రణ్బీర్ పాత్ర భార్యకు, కుటుంబానికి ఎంతో గౌరవాన్నిస్తుంది. ఆడియన్స్కు ఆ పాత్ర కచ్చితంగా నచ్చాలనే నిబంధన లేదు. అది పూర్తిగా ఆడియన్స్ అభిరుచి.’ అని తెలిపారు.