AP: గోదావరిలో పడవ బోల్తాపడిన ఘటనలో గల్లంతైన ఇద్దరు మృతి చెందారు. రాజమహేంద్రవరానికి చెందిన 12 మంది యువకులు సోమవారం మధ్యాహ్నం బ్రిడ్జి లంక వద్దకు మద్యం తాగేందుకు వెళ్లారు. రాత్రి 8 గంటల సమయంలో తిరిగి వస్తుండగా వారి పడవ బోల్తా పడింది. ఈత వచ్చిన 10 మంది సురక్షితంగా బయటకు రాగా, భవానీపురానికి చెందిన గాడా రాజు (23), కోటిలింగాలపేటకు చెందిన చెవల అన్నవరం(54) మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేశారు.