హైదరాబాద్ వేదికగా 72వ మిస్ వరల్డ్ పోటీలు జరుగనున్నాయి. మే 7 నుంచి ప్రారంభమయ్యే అందాల పోటీ నిర్వహణ ఏర్పాట్లపై అధికారులు సమావేశం నిర్వహించారు. గురువారం బేగంపేట్‌లో ప్రీ ఈవెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ మీటింగ్‌కి మంత్రి జూపల్లి కృష్ణారావు, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి, టూరిజం సెక్రటరీ స్మితా సబర్వాల్, మిస్ వరల్డ్ లిమిటెడ్ CEO జూలియా మోర్లీ, 2024 ప్రపంచ సుందరి క్రిస్టినా పిజ్కోవా హాజరుకానున్నారు.