ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సందర్భంగా, తన ఇష్ట దైవం కొండగట్టు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవడానికి హైదరాబాద్ నుండి కొండగట్టు రోడ్డు మార్గం ద్వారా బయలుదేరిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కి దారి పొడవునా గజమాలలతో, జయ జయ నినాదాలతో తెలంగాణ జనసేన శ్రేణులు, అభిమానులు, ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు.