ఆకునూరులో ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రారంభం

చేర్యాల మండలం ఆకునూరులో మంగళవారం ప్రజాపాలన దరఖాస్తులను ఇంటింటి సర్వే క్రమంలో మండల శాఖ అధ్యక్షుడు కొమ్ము రవి, గ్రామశాఖ అధ్యక్షుడు ఆకుల రాజు, వార్డ్ స్పెషల్ అధికారి కోయడ సందీప్ కలిసి అర్హుల వివరాలు నమోదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు అర్హులైన ప్రతిఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు వస్తాయని తెలిపారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లాయూత్ ప్రధాన కార్యదర్శి అందే నానిబాబు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్