ములుగు జిల్లా రవాణా శాఖ అభివృద్ధి పనులకు శనివారం నిధులు విడుదల చేశారు. మంత్రి సీతక్క చేసిన ప్రతిపాదనలను ఆర్టీసీ బోర్డు ఆమోదం తెలిపినట్లు మంత్రి కార్యాలయ వర్గం ఓ ప్రకటన విడుదల చేశారు. అభివృద్ధి పనుల్లో ఏటూరునాగారం బస్ డిపో నిర్మాణానికి రూ. 6. 28 కోట్లు, ములుగు బస్ స్టేషన్ నిర్మాణానికి రూ. 5. 11 కోట్లు, మంగపేట బస్టాండ్ కోసం రూ. 51 లక్షలు విడుదలయ్యాయి.