ములుగు: సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుంటున్న భక్తులు

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క - సారలమ్మ వనదేవతలను దర్శించుకోవడానికి ఆదివారం భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు ఉదయం నుంచే భారీగా తరలివచ్చారు. జంపన్న వాగు వద్ద పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు తల్లుల గద్దెల వద్దకు చేరుకొని తల్లులకు ఇష్టమైన పసుపు, కుంకుమ, చీరే సారే, బంగారం (బెల్లం) సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్