ములుగు జిల్లాలో అచ్చం అమెజాన్ అడవిని తలపించేలా కొండ్రేడు అటవీ ప్రాంతం ఆకట్టుకుంటోంది. ఏటూరునాగారం మండలం కొండాయి ఊరట్టం మధ్య కొండ్రేడు అభయారణ్యంలో ఏపుగా పెరిగిన భారీ వృక్షాలు, ప్రకృతి రమణీయ దృశ్యాలు కట్టిపడేస్తున్నాయి. దట్టమైన అడవి మధ్యలో జంపన్నవాగు ప్రవాహం కనువిందు చేస్తోంది.