ములుగు జిల్లా కేంద్రంలోని తిరుమల సినిమా ధియేటర్ సమీపంలో సోమవారం గుర్తు తెలియని వృద్దుడి మృతదేహం లభ్యం అయింది. మృతదేహాన్ని ములుగు ఏరియా హాస్పిటల్ కి తరలించి ఫ్రీజర్ బాక్స్ లో పోలీసులు భద్ర పరిచారు. మృతుడికి సంబందించిన వివరాలు తెలిస్తే పోలీస్ స్టేషన్ లో తెలపాలని పోలీసులు సూచించారు.