ఏటూరునాగారంలో చోరీ.. ఆలస్యంగా వెలుగులోకి

ములుగు జిల్లా ఏటూరునాగారంలోని 8వ వార్డులో దొంగతనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు వడ్డేపల్లి శ్రీనివాస్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మంగళవారం అర్ధరాత్రి తన ఇంట్లో దొంగలు చొరబడి రూ. 80 వేల నగదు ఎత్తుకెళ్లారు. ఇంటి నిర్మాణం కోసం అప్పుగా తెచ్చుకున్న నగదును బీరువాలో పెట్టామని వెల్లడించాడు. కాగా, ఈ విషయంపై స్థానిక పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపాడు.

సంబంధిత పోస్ట్