వరంగల్: రీజియన్ నుండి 4లక్షల ప్రయాణికులను చేరవేసిన ఆర్టీసీ

దసకు తిరుగు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా వారి గమ్య స్థానాలకు చేర్చినట్లు ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి విజయభాను తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం నుండి సోమవారం రాత్రి వరకు 2500 బస్సుల ద్వారా 4లక్షల మంది ప్రయాణికులను వివిధ ప్రాంతాలకు చేర్చడం జరిగిందన్నారు. ఇందుకు సహకరించిన తమ ఉద్యోగులకు, అధికారులకు, తమ సంస్థను ఇంతగా ఆదరించిన ప్రయాణికులకు ఈ సందర్భంగా ఆర్ ఎం విజయ భాను కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్