కాలుష్య నివారణకు మొక్కలు నాటాలి

కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని స్పెషల్ ఆఫీసర్ బాలరాజు తెలిపారు. గురువారం దామెర మండల కేంద్రంలో 'నాటుదాం ఒక చెట్టు-అమ్మ పేరు మీద' అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ బాలరాజు హాజరై వివిధ రకాలైన మొక్కలు నాటారు. సామాజిక అంశంగా మొక్కలను నాటాలని, నాటిన మొక్కలను సంరక్షించాలని ఆయన సూచించారు. ఇందులో ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, ఎంపీవో రంగాచారి, ఏపీవో శారద ఉన్నారు.

సంబంధిత పోస్ట్