చర్మ కాన్సర్ బారిన పడకుండా ప్రతి ఒక్కరు సన్‌స్క్రీన్‌ను కచ్చితంగా వాడాలని వైద్యులు చెప్తున్నారు. ఈక్రమంలో నెదర్లాండ్స్‌లో పెరుగుతున్న చర్మ క్యాన్సర్ కేసులను పరిష్కరించడానికి అక్కడి ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉచితంగా సన్‌స్క్రీన్‌ను అందిస్తోంది. పాఠశాలలు, పార్కులు తదితర బహిరంగ ప్రదేశాల్లో సన్‌స్క్రీన్ డిస్పెన్సర్లను అందుబాటులో ఉంచుతోంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.