చాలా మందికి పాములంటే భయం. వాటిని చూస్తే దూరం నుంచే పారిపోతారు. అయితే ఈ ప్రపంచంలో పాములను కూడా తినే వాళ్లు ఉన్నారు. ఇదే కోవలో దక్షిణ కొరియాకు చెందిన ఓ యువతి కూరగాయలతో పాటు సజీవంగా ఉన్న పాములను ప్లేట్లో ఉంచింది. తర్వాత ఆ పామును కొద్దికొద్దిగా కొరికి నమిలి మింగింది. ఈ వీడియోను @asmrmukbangworld అనే ఇన్స్టా ఖాతాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ వీడియో చూసి ఆశ్చర్యపోతున్నారు.