నీట్‌ అవకతవకలపై సీబీఐ విచారణ: కాంగ్రెస్‌ డిమాండ్‌

55చూసినవారు
నీట్‌ అవకతవకలపై సీబీఐ విచారణ: కాంగ్రెస్‌ డిమాండ్‌
నీట్‌ ప్రశ్నాపత్నం లీకేజ్‌తో పాటు పరీక్షలో జరిగిన అవకతవకలపై సుప్రీంకోర్టు సిట్టింగ్‌ జడ్జి పర్యవేక్షణలో సీబీఐ విచారణ చేపట్టాలని కర్నాటక మంత్రి ఈశ్వర ఖండ్రే డిమాండ్‌ చేశారు. నీట్ అక్రమాలపై అత్యున్నత స్ధాయి విచారణకు కాంగ్రెస్‌ నేతలు కోరుతున్నారని అన్నారు. నీట్ పరీక్షల నిర్వహణలో పలు అవకతవకలు చోటుచేసుకున్నాయని, అక్రమాలకు బాధ్యులను గుర్తించి వారిపై కఠిన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్