టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ. కోటి విరాళం

54చూసినవారు
టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ. కోటి విరాళం
AP: తిరుమల వేంకటేశ్వరస్వామికి చెన్నైకి చెందిన ఓ భక్తుడు భారీ విరాళాన్ని అందజేశారు. సెన్సార్ క్యాపిటల్ కంపెనీ ఎండీ, సీఈవో వెంకటేష్ కన్నపన్ టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ. కోటి విరాళం అందించారు. ఈ విరాళాన్ని డీడీ రూపంలో శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్