తిరుమలలో సిఫారసు లేఖల దర్శనాలు రద్దు: బీఆర్‌ నాయుడు

57చూసినవారు
తిరుమలలో సిఫారసు లేఖల దర్శనాలు రద్దు: బీఆర్‌ నాయుడు
తిరుమలలో రథసప్తమి వేడుకలను పురస్కరించుకొని సిఫారసు లేఖల దర్శనాలు పూర్తిగా రద్దు చేస్తున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఫిబ్రవరి 3 నుంచి రథసప్తమి జరగనుండటంతో బీఆర్ నాయుడు అన్నమయ్య భవనంలో ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఈ వేడుకలను పురస్కరించుకొని పలు సేవలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. అలాగే సర్వదర్శనం టోకెన్లను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్