గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయిన నటి రన్యారావు కేసు దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. ఆమెపై సీబీఐ అధికారులు శనివారం కేసు నమోదు చేశారు. దాంతో వారు త్వరలోనే రన్యారావును విచారించే అవకాశం ఉంది. ప్రస్తుతం డీఆర్‌ఐ అధికారుల కస్టడీలోనే ఉన్న రన్యారావును.. అక్కడి విచారణ అనంతరం సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఆమె కాల్‌డేటాలోని వివరాల ఆధారంగా ఢిల్లీ, ముంబయిలోనూ సీబీఐ అధికారులు దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.