300 కేజీల గంజాయి స్వాధీనం (వీడియో)

52చూసినవారు
కారులో అక్రమంగా తరలిస్తున్న గంజాయి ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన అనకాపల్లి జిల్లా లంకెలపాలెంలో చోటు చేసుకుంది. పట్టణంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న కారును పోలీసులు అడ్డుకున్నారు. కారును చెక్ చేసి చూడగా.. అందులో 150 ప్యాకెట్లలో 300 కేజీల గంజాయిని గుర్తించారు. ఈ మేరకు కారుతోపాటు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన సంతోష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. మరొకరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్