18వ శతాబ్దంలో రష్యాలోని షుయా ప్రాంతంలో ఫియోడర్ వాసిలీవ్ అనే రైతు భార్య వాలెంటీనా 27 సార్లు గర్భం దాల్చి.. 69 మందికి జన్మనిచ్చి గిన్నిస్ రికార్డుల్లోకెక్కింది. ఆమెకు 16 కాన్పుల్లో కవలలు, 7 ప్రసవాలలో ముగ్గురు చొప్పున పిల్లలు, మరో 4 కాన్పుల్లో నలుగురు చొప్పున జన్మించారు. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజమేనని ఆ కాలపు ఆధారాలు సూచిస్తున్నాయి. ఫియోడర్ రెండో భార్య 8 కాన్పుల్లో 18 మందికి జన్మనిచ్చింది.