కాకినాడ పోర్టు అంశంలో తనకు లుకౌట్ నోటీసులు జారీ చేయడం పట్ల వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. 'కేవీరావు చంద్రబాబుకు చెంచా. కేవీరావు ఫిర్యాదు మీద విచారణే లేకుండా నేరుగా కేఎస్ ఫైల్ చేయడం ఓ డ్రామా. మళ్లీ అధికారంలోకి వస్తాం, సీఎం చంద్రబాబు బతికి ఉంటే తిరిగి జైలుపాలు కాక తప్పదు. బాబు 55 రోజులు జైల్లో ఉన్నాడు.. అందుకే అందర్నీ జైలుకు పంపాలని చూస్తున్నాడు' అని విజయసాయిరెడ్డి మండిపడ్డారు.