ఎన్టీఆర్ వైద్య సేవ నెట్‌వర్క్ ఆస్పత్రులకు కూటమి ప్రభుత్వం ఉపశమనం కల్పించింది. గత ప్రభుత్వం నెట్‌వర్క్ ఆస్పత్రులకు దాదాపు రూ.2,300 కోట్ల బకాయిలు పెట్టింది. దీంతో ఆస్పత్రుల నిర్వహణే కష్టంగా మారింది.బుధవారం దాదాపు రూ.200 కోట్లను నెట్‌వర్క్ ఆస్పత్రుల ఖాతాల్లో జమ చేసింది. మరో రెండు రోజుల్లో రూ.300 కోట్లు బకాయిలు విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం నెట్‌వర్క్ ఆస్పత్రులకు పెట్టిన బకాయిల్లో దాదాపు రూ.700 కోట్ల వరకూ విడుదల చేసింది.