9 నెలల మిస్టరీ.. పది రోజుల్లో వీడింది

85చూసినవారు
9 నెలల మిస్టరీ.. పది రోజుల్లో వీడింది
భీమవరం పట్టణానికి చెందిన ప్రభాకర్ రావు, శివకుమారి దంపతులకు ఇద్దరు సంతానం. చిన్న కూతురు తేజస్విని విజయవాడలో తన పెద్దమ్మ ఇంట్లో ఉంటూ మాచవరంలో హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు చదువుతోంది. అదే కాలేజీకి చెందిన అంజాద్ అనే యువకుడితో ప్రేమలో పడింది. ఇద్దరూ గతేడాది అక్టోబర్ 28న ఇంట్లో నుంచి పారిపోయారు. జూన్ 22న మంగళగిరిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజాదర్భార్ నిర్వహించారు. తమ కుమార్తె ఆచూకీ తెలియక 9 నెలలు అవుతుందని తల్లి శివకుమారి ఫిర్యాదు చేసింది. దాంతో స్పందించిన పవన్.. యువతిని కనిపెట్టాలని పోలీసులను ఆదేశించారు. జమ్ము కశ్మీర్‌లో యువతి ఉన్నట్లు గుర్తించారు. ఇవాళ విజయవాడకు వారిని పోలీసులు తీసుకురానున్నారు.

సంబంధిత పోస్ట్