మీ ప్రేమకు ఎప్పుడూ రుణపడి ఉంటా: ఎన్టీఆర్

68చూసినవారు
మీ ప్రేమకు ఎప్పుడూ రుణపడి ఉంటా: ఎన్టీఆర్
‘దేవర’ చిత్రం విడుదల సందర్భంగా శుక్రవారం అభిమానులను ఉద్దేశించి ఎక్స్‌ వేదికగా ఎన్టీఆర్‌ పోస్ట్ పెట్టారు. ‘‘నేను ఎదురుచూస్తున్న రోజు వచ్చింది. మా సినిమాపై మీరు చూపిస్తోన్న అభిమానాన్ని చూసి చాలా సంతోషంగా ఉంది. నా అభిమానుల వేడుకలు చూసి నా మనసు నిండింది. మీ ప్రేమాభిమానాలకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటా. నాలానే మీరూ ఈ చిత్రాన్ని ఎంజాయ్‌ చేయడం చూస్తుంటే సంతోషంగా ఉంది. మీకు మరెంతో వినోదాన్ని అందిస్తానని మాటిస్తున్నా’’ అని ఎన్టీఆర్‌ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్