AP: విశాఖ జిల్లా పద్మనాభం మండలం కృష్ణాపురంలో ఒకే రోజు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. వివాహిత కనకల లక్ష్మి (30) సూసైడ్ చేసుకున్నారు. దాంతో ఆమె ఇద్దరు పిల్లలు తల్లి లేనివారయ్యారు. లక్ష్మి భర్త లారీ డ్రైవర్‌గా పని చేస్తుంటారు. మరొవైపు ఆదిత్య (22) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక్కగానొక్క కొడుకు మరణించడంతో ఆదిత్య తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.