AP: జగన్ ప్రభుత్వ బాధితులమంటూ సీఎం చంద్రబాబు ఎదుట జవాన్ దంపతులు తమ గోడు చెప్పుకున్నారు. తమ స్థలాన్ని కబ్జా చేశారని, సరైన అనుమతులు ఇవ్వకుండా వేధించారని జవాన్ జ్ఞానానంద్, ఆయన భార్య విలపించారు. కార్గిల్ యుద్ధంలోనూ పాల్గొన్నానని సీఎం చంద్రబాబుకు జవాన్ జ్ఞానానంద్ తెలిపారు. సమస్యను పరిష్కరిస్తానని చంద్రబాబు వారికి హామీ ఇచ్చారు.