ఐపీఎల్ 2025లో భాగంగా లక్నో వేదికగా శుక్రవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. LSG ఇచ్చిన 204 పరుగుల లక్ష్యఛేదనలో ముంబై జట్టు విఫలమైంది. నిర్ణీత 20 ఓవర్లలో ముంబై 5 వికెట్లు కోల్పోయి 191 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై బ్యాటర్లలో సూర్య (67) హాఫ్ సెంచరీతో రాణించారు. LSG బౌలర్లలో దిగ్వేశ్ రాఠీ, ఆకాశ్ దీప్, శార్దూల్ ఠాకూర్, అవేష్ ఖాన్ తలో వికెట్ తీశారు.